హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాయత్రి కళాశాలలో సైబర్ పాఠాలు

పెద్దపల్లిలోని గాయత్రి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గోదావరిఖని సైబర్ పోలీస్ స్టేషన్ ఎస్సై మారుతి ముఖ్య అతిథిగా హాజరై నకిలీ పెట్టుబడి పథకాలు, డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు, ఆన్‌లైన్ బెట్టింగ్, లోన్ యాప్‌లు, నకిలీ ఉద్యోగ ప్రకటనలతో జరిగే మోసాలను వివరించారు. ఓటీపీ, బ్యాంకు వివరాలు చెప్పొద్దన్నారు. ప్రిన్సిపాల్ బండారి సురేశ్ పాల్గొన్నారు.