హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తిలో దివ్య నామస్మరణ ప్రారంభం

SS: సత్యసాయి బాబా 101వ జయంతి ఉత్సవాల్లో భాగంగా పుట్టపర్తిలో దివ్య నామస్మరణ కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గణేష్ సర్కిల్ నుంచి సత్యమ్మ ఆలయం వరకు సాగిన యాత్రలో భక్తులు భజనలు, కోలాటాలతో ‘ఓం శ్రీ సత్యసాయిరామ్’ నామస్మరణ చేశారు. జిల్లా యంత్రాంగం భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.