కోనసీమ: పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శనివారం కుండలేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మేళతాళాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చాగంటి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
కుండలేశ్వర స్వామిని దర్శించుకున్న చాగంటి


