హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన

నిర్మల్ ముథోల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ గోపాల్ విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులందరితో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.