హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న(నవంబర్ 20) శ్రీవారిని 56,695 మంది భక్తులు దర్శించుకోగా, 24,786 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.4.28 కోట్ల ఆదాయం వచ్చింది. నిన్న 1.87 లక్షల మందికి అన్నప్రసాదం అందించారు. కాగా, ఇవాళ 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా, సర్వదర్శనానికి 4-6 గంటల సమయం పడుతోంది.