హైదరాబాద్: 28°C
తెలంగాణ

శబరిమల భక్తులకు ప్రత్యేక బస్సులు

NLG: అయ్యప్ప భక్తుల కోసం టీజీఎస్‌ఆర్టీసీ నల్గొండ రీజియన్ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని డిపోల నుంచి శబరిమలకు సూపర్ డీలక్స్, డీలక్స్ బస్సులు నడపనున్నారు. రానుపోను ప్రయాణానికి ఒక్కో భక్తుడికి రూ.5,503 ఛార్జీ నిర్ణయించారు. బృందాలుగా బుక్ చేసుకుంటే రాయితీలు, ఉచిత ప్రయాణ సదుపాయాలు కల్పించనున్నారు.