హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MLC నాగబాబుకు ఆత్మీయ సత్కారం

W.G: జనసేన ప్రధాన కార్యదర్శి, MLC కొణిదెల నాగబాబును శుక్రవారం రాత్రి భీమవరం MLA పులపర్తి రామాంజనేయులు మర్యాద పూర్వకంగా కలిశారు. భీమవరం విచ్చేసిన నాగబాబుకు ఘనస్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు పులపర్తి ప్రశాంత్, జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు, భీమవరం మున్సిపల్ ఛైర్ పర్సన్ కూటమి అభ్యర్థి డాక్టర్ చుండూరి మల్లేశ్వరి, కూటమి నేతలు పాల్గొన్నారు.