హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాల, వేటపాలెం ఎంపీపీలు ఏకగ్రీవం

బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చీరాల ఎంపీపీగా సిద్ధి సునీత దేవాంగపురి, వైస్ ఎంపీపీగా ఆసాది రాజేశ్వరి ఎన్నికయ్యారు. వేటపాలెం ఎంపీపీగా ఎర్రంశెట్టి కోమలి, వైస్ ఎంపీపీగా పులి హరికృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు మండలాల్లోని 45 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది.