హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారులతో పాయం కీలక సమావేశం

BDK: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన శనివారం హైదరాబాద్‌లో ఎస్టీ సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించారు. గిరిజనులకు ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో 10 శాతం రిజర్వేషన్ల అమలు, రోస్టర్ విధానం, పోడు భూముల సమస్యలు, అటవీ–రెవెన్యూ శాఖల సమన్వయంపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. గిరిజనుల హక్కులు, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు.