హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంచి స్పర్శ–చెడు స్పర్శపై విద్యార్థులకు అవగాహన

విజయనగరంలోని ఓ పాఠశాలలో శనివారం పోక్సో చట్టం-2012పై న్యాయ అవగాహన నిర్వహించారు. సురక్షిత బాల్యం అభియాన్‌లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక న్యాయమూర్తి బి. శ్రీధర్ పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధానికి చట్టం కల్పిస్తున్న రక్షణలను వివరించారు. మంచి స్పర్శ, చెడు స్పర్శను గుర్తించాలని, అనుచిత ప్రవర్తన ఎదురైతే భయపడొద్దన్నారు.