బాపట్ల జిల్లా ఎస్పీ బీ.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా 'శక్తి' బృందాలు మహిళలు, యువతకు 'శక్తి యాప్'పై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో పర్యటిస్తూ, ఆపద సమయంలో పోలీసుల తక్షణ సాయం కోసం ఈ యాప్‌ను ఎలా వినియోగించుకోవాలో వివరిస్తున్నారు. యాప్ డౌన్‌లోడ్ ప్రక్రియను దగ్గరుండి చేయిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
'శక్తి యాప్'పై విస్తృత అవగాహన


