NDL: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పురస్కరించుకుని జిల్లా SP సునీల్ షొరాణ్ పలు కేంద్రాలు, సమస్యాత్మక గ్రామాల్లో ఇవాళ పర్యటించారు. కంపమల్ల పోలీస్ పికెట్‌ను తనిఖీ చేసి స్థానిక పరిస్థితులు, భద్రతా చర్యలను సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అప్రమత్తంగా ఉండాలని, అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పటిష్ట బందోబస్తు చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతపై ఎస్పీ తనిఖీ


