హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రంలో యోగా దినోత్సవం

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని 9వ వార్డు బీసీ అంగన్వాడీ కేంద్రంలో శనివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎం.వీ.ఎస్. పార్వతి మాట్లాడుతూ.. యోగా శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని తెలిపారు. అనంతరం చిన్నారులు, అంగన్వాడీ సిబ్బంది వివిధ యోగాసనాలు, ప్రాణాయామం చేశారు.