SRD: ఝరాసంగం మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను మండల న్యాయ సేవల కమిటీ ఛైర్ పర్సన్, సీనియర్ సివిల్ జడ్జి కవితాదేవి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యా బోధనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల నిర్వహణ తీరును పరిశీలించారు. కార్య క్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
తెలంగాణ
పాఠశాలను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి


