NTR: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జగ్గయ్యపేటలోని వాగ్దేవి మహిళా డిగ్రీ కళాశాలలో ఈనెల 23న జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగ మేళాకు ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్లలోపు యువతీ యువకులు అర్హులన్నారు. వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం అందించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 23న జాబ్ మేళా


