హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ జల పురస్కారానికి నెల్లూరు పరిశీలన

నెల్లూరు నగరపాలక సంస్థ నీటి నిర్వహణ పనులను కేంద్ర జల వనరుల శాఖ బృందం మూడు రోజుల పాటు పరిశీలించింది. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, సీవేజ్ ప్లాంట్లు, ఇంకుడు గుంతలను సందర్శించింది. నీటి పొదుపు, కాలుష్య నివారణ, భూగర్భ జలాల పెంపులో నగరపాలక సంస్థ పనితీరును జాతీయ జల పురస్కారానికి పరిశీలిస్తున్నట్లు బృందం వెల్లడించింది.