E.G: రాజమండ్రి వాసులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే తన ప్రధాన లక్ష్యమని రాజమండ్రి స్వతంత్ర మేయర్ అభ్యర్థి అజ్జరపు శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో కార్మికులను పెంచి పారిశుద్ధ్యం మెరుగుపరుస్తామని, సరైన పన్ను విధానం తెస్తామన్నారు. గోదావరి కాలుష్య నివారణకు STP కేంద్రాల పర్యవేక్షణకు మేయర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛమైన తాగునీరే నా లక్ష్యం: స్వతంత్ర అభ్యర్థి అజ్జరపు


