W.G: ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఇంఛార్జ్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 5,300 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, వాహనాలు, హమాలీలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రైతుల అభిప్రాయాలు సేకరించి చర్యలు చేపట్టాలని, గోనె సంచుల నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చర్యలు'


