హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోళ్లను దొంగిలించేందుకు వచ్చి దొంగ మృతి

E.G: కోళ్లను దొంగిలించేందుకు వచ్చిన వ్యక్తిపై కాపలాదారులు దాడి చేయడంతో అతడు మరణించిన ఘటన కోరుకొండ మండలం మధురపూడిలో చోటు చేసుకుంది. దొంగను గమనించిన ఫారం యజమాని అతడిని పట్టుకొని చెట్టుకు కట్టేశాడు. కాపలాదారులు తీవ్రంగా కొట్టడంతో దొంగ మృతి చెందాడు. మృతుడిని కృష్ణా జిల్లాకు చెందిన నరేశ్‌గా గుర్తించారు. అతడిపై అక్కడ కూడా 5 దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసుల ద్వారా తెలిసింది.