హైదరాబాద్: 28°C
తెలంగాణ

TAGS రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

ADB: ఆదివాసుల హక్కుల పరిరక్షణకై ఈనెల 28, 29 తేదీలలో ఆసిఫాబాద్‌లో జరిగే తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కోశాధికారి పెందూర్ గోవింద్ పిలుపునిచ్చారు. శనివారం సత్నాల మండలంలోని సైదాపూర్ గ్రామంలో మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. 28న జరిగే బహిరంగ సభకు మాజీ ఎంపీలు బృందా కరత్, మిడియం బాబురావు హాజరవుతారని పేర్కొన్నారు.