విజయనగరం కార్పొరేషన్‌లో కూటమి తరఫున గెలిచిన 62 మంది కార్పొరేటర్లు, మేయర్‌తో అశోక్ బంగ్లాలో ఇవాళ ప్రత్యేక సమావేశం జరిగింది. దీనికి జనసేన నాయకురాలు పాలవలస యశస్వి హాజరై విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, ప్రజా సమస్యలపై చర్చించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
అశోక్ బంగ్లాలో ప్రత్యేక సమావేశం


