హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టర్‌ను కలిసిన వైసీపీ ఇంఛార్జ్

ప్రకాశం: ఈ నెల 26న జరగనున్న సర్పంచ్ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కనిగిరి వైసీపీ ఇంఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ కలెక్టర్ ఎం.విజయ సునీతను కోరారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పోలింగ్ కేంద్రాల్లో అదనపు బలగాలు ఏర్పాటు చేయాలని కోరారు.