హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొమ్మూరు సర్పంచ్ అభ్యర్థిగా డాక్టర్ ఆలీ

GNTR: కాకుమాను మండలం కొమ్మూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా డాక్టర్ ఆలీ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. కొమ్మూరు పంచాయతీ కార్యాలయంలో ఆలీ నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందచేశారు. ఆలీ గత 30 సంవత్సరాలుగా వరగాని గ్రామంలో ఉంటూ.. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు ఆర్ఎంపీగా విశేషంగా వైద్యసేవలు అందచేశారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పోటీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.