NTR: గంపలగూడెం మండలం కనుమూరు గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో శనివారం ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. గ్రామ ప్రజలు, రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి ఆనవాళ్లు కనిపిస్తే దగ్గరకు వెళ్లకుండా, వెంటనే అటవీ శాఖ లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కనుమూరు పరిసరాల్లో పులి సంచారం


