హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఫిర్యాదుల పరిష్కారంపై ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి'

TPT: జిల్లాలో పీజీఆర్ఎస్ ద్వారా సమర్పించిన ఫిర్యాదులు పరిష్కారమైన తర్వాత ప్రజలు తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయాలని కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ కోరారు. ఫిర్యాదుల పరిష్కార స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించారు. ప్రజల అభిప్రాయాల ఆధారంగా ప్రభుత్వ సేవల నాణ్యతను మెరుగుపరుస్తామని తెలిపారు.