హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నాయకులతో మాజీ ఎమ్మెల్యే ములాఖత్

PLD: క్రోసూరు మండలం అనంతరం గ్రామంలో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వైసీపీ సర్పంచ్ అభ్యర్థి, నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. సత్తెనపల్లి సబ్ జైల్లో ఉన్న వారిని శనివారం ఆయన ములాఖత్ ద్వారా కలిశారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో భయపెడుతోందని, కార్యకర్తలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.