హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దివ్యాంగ క్రీడాకారులకు కలెక్టర్ ప్రోత్సాహం

CTR: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3న నిర్వహించనున్న కార్యక్రమాల్లో భాగంగా దివ్యాంగ క్రీడాకారుల ఎంపిక పరీక్షల పోస్టర్‌ను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. దివ్యాంగ పిల్లల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు.