ELR: జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం రెండో శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. జంగారెడ్డిగూడెంకు చెందిన పొదిలి దుర్గాప్రసాద్, శివఈశ్వరి దంపతులు సుమారు రూ.6 లక్షల విలువైన బంగారు తులసీ దళాలను స్వామివారికి కానుకగా సమర్పించారు. శనివారం ఒక్కరోజే ఆలయానికి రూ.1,39,600 ఆదాయం వచ్చినట్లు ఈవో వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వెంకన్నకు బంగారు తులసీ దళాలు బహుకరణ


