హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటర్లకు అవగాహన కల్పించండి'

PPM: రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు బ్యాలెట్ ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలతను కోరారు. శనివారం డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు, డీఆర్వోను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు ఎక్కువ వచ్చాయన్నారు.