హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజాసేవపై ఎమ్మెల్యే దిశానిర్దేశం

TPT: వడమాలపేట జడ్పీటీసీగా ఎన్నికైన పి. హేమావతి శనివారం కుటుంబ సభ్యులతో కలిసి నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రజాసేవకు ప్రాధాన్యమిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరినట్లు హేమావతి తెలిపారు.