హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకృతి పరిరక్షణ మన బాధ్యత: MEO

ELR: ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని MEO రాములు అన్నారు. జంగారెడ్డిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎన్జీసీ డివిజనల్‌ కోఆర్డినేటర్‌ బిరుదుగడ్డ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం జరిగింది. మానవుడి స్వార్థంతో భూతాపం, వరదలు, కరువులు పెరుగుతున్నాయన్నారు. మొక్కలు నాటడమే కాదు, పెరిగే వరకు సంరక్షించాలని సూచించారు.