హైదరాబాద్: 28°C
క్రీడలు

గంభీర్‌ అండగా నిలబడ్డాడు: సర్ఫరాజ్‌ ఖాన్‌

డ్రెస్సింగ్‌ రూమ్‌ లీక్‌ ఆరోపణల వేళ తాను తీవ్రంగా కుంగిపోయానని సర్ఫరాజ్ ఖాన్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆరోపణలు నిజమైతే భారత్ A, శ్రీలంక సిరీస్‌కు ఎంపికయ్యేవాడిని కాదన్నాడు. ఆ సమయంలో ఎవరూ స్పందించలేదని, కుటుంబం బాధపడిందని తెలిపాడు. కోచ్ గౌతమ్ గంభీర్ తనకు, తన తండ్రికి ఫోన్ చేసి ధైర్యం చెప్పాడని, ఆటపై దృష్టి పెట్టమని సూచించాడని సర్ఫరాజ్ పేర్కొన్నాడు.