హైదరాబాద్: 28°C
క్రీడలు

NZ vs IND: సెంచరీ చేజార్చుకున్న గిల్

టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. ఆట నిలిచే సమయానికి భారత్ 125 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 486 పరుగులు చేసింది. కెప్టెన్ గిల్‌ (98) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. జాకబ్ డఫీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. మరో బ్యాటర్ పంత్ (55*) అర్ధశతకం చేశాడు. ప్రస్తుతం భారత్ 118 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 368 పరుగులు చేసింది.