న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ (136) ఔటయ్యాడు. నాథన్ స్మిత్ వేసిన ఆఫ్‌సైడ్ బంతిని ఆడే క్రమంలో గ్లౌవ్స్‌ను తాకుతూ వికెట్లకు తగిలింది. దీంతో మూడో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం భారత్ స్కోరు 104 ఓవర్లకు 386/3. క్రీజ్‌లో గిల్ (59*), రిషభ్ పంత్ ఉన్నారు. టీమిండియా 18 పరుగుల ఆధిక్యంలో ఉంది.
క్రీడలు
NZ vs IND: సెంచరీ హీరో కేఎల్ రాహుల్ ఔట్


