న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. జేమీసన్ వేసిన 83వ ఓవర్ ఆఖరికి బంతికి దేవదత్ పడిక్కల్ (80) బౌల్డ్ అయ్యాడు. కొత్త బంతిని తీసుకున్న మూడో ఓవర్‌లోనే కివీస్‌కు వికెట్ దక్కింది. దీంతో కేఎల్ రాహుల్-పడిక్కల్ మధ్య రెండో వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం భారత్ స్కోరు 83 ఓవర్లలో 295/2గా ఉంది. భారత్ ఇంకా 73 పరుగుల వెనుకబడి ఉంది.
క్రీడలు
NZ vs IND: దేవదత్ పడిక్కల్ సెంచరీ మిస్


