హైదరాబాద్: 28°C
తెలంగాణ

తండ్రికి తలకొరివి పెట్టిన చిన్నారి

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వాసి దాసారం లింబాద్రి (28) అయ్యప్పమాల ధరించేందుకు వెళ్లి గుండెపోటుతో మృతిచెందారు. శనివారం జరిగిన అంత్యక్రియల్లో కొడుకులు లేకపోవడంతో మూడో తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె ప్రణవి తండ్రి చితికి నిప్పంటించింది. 18 నెలల చిన్నారి శ్రీనిత, భార్య లాస్య రోదనలు గ్రామస్థులను కలచివేశాయి.