హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిక్కోలులో పొగమంచు బీభత్సం

SKLM: జిల్లా వ్యాప్తంగా శనివారం పొగమంచు తీవ్రంగా కమ్మేసింది. దీంతో రహదారులు కనిపించకపోవడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దారి స్పష్టంగా కనిపించక వాహనదారులు బైక్ లైట్లు వేసుకుని నత్తనడకన ప్రయాణం చేస్తున్నారు. ఈ వాతావరణ పరిస్థితుల్లో వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.