హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కొయ్యూరులో పొగమంచు సోయగం

ASR: కొయ్యూరులో శనివారం ఉదయం దట్టమైన పొగమంచు కురవడంతో ప్రకృతి అందాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అక్వాన్ తుఫాను ప్రభావంతో నాలుగు రోజులుగా మబ్బులతో కూడిన వాతావరణం నెలకొంది. చింతపల్లిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13 నుంచి 17 డిగ్రీలకు పెరగడంతో చలి తీవ్రత కొంత తగ్గింది. తుఫాను తీరం దాటడంతో మళ్లీ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయి.