న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ (100*) అద్భుతమైన సెంచరీ చేశాడు. 207 బంతుల్లో మూడంకెల స్కోరును చేరుకున్నాడు. కెరీర్‌లో అతడికిది 13వ శతకం. మరో ఎండ్‌లో దేవదత్ పడిక్కల్ (57*)తో కలిసి రెండో వికెట్‌కు ఇప్పటికే 125 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 71 ఓవర్లకు 255/1గా ఉంది.
క్రీడలు
కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ


