హైదరాబాద్: 28°C
క్రీడలు

NZ vs IND: భారీ స్కోరు దిశగా భారత్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. నాలుగు వందల మార్క్‌ను దాటేసింది. కెప్టెన్ గిల్ (92*) సెంచరీకి దగ్గరగా ఉన్నాడు. మరో బ్యాటర్ పంత్ (25*) బ్యాట్‌ను ఝళిపిస్తున్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌క ఇప్పటికే హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నిర్మించారు. ప్రస్తుతం భారత్ స్కోరు 119 ఓవర్లకు 450/3గా ఉంది. కివీస్ కంటే 82 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.