హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారులకు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు

GNTR: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేశ్ గంగపుత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్‌కు, మత్స్యకారులకు గొప్ప వరమని పేర్కొన్నారు. 'మత్స్యకారుల సేవలో' పథకం ద్వారా కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. వారి జీవనోపాధి మెరుగుదల, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.