హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెబ్బటం సర్పంచ్‌గా సవరమ్మ ఏకగ్రీవం

KRNL: హొళగుంద మండలం హెబ్బటం గ్రామ సర్పంచ్‌గా గుబ్బిలి సవరమ్మ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆలయాల నిర్మాణం కోసం గ్రామంలో నిర్వహించిన సర్పంచ్ పదవి వేలంలో రూ.35 లక్షలకు ఆమె పదవిని దక్కించుకున్నారు. గ్రామాభివృద్ధి, ఆలయాల నిర్మాణ లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు వెల్లడించారు. దీంతో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది.