హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

VZM: తెర్లాం మండలం కూసుమూరు ఆర్ఎస్‌కే కేంద్రంలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ ఆర్.ధనం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు ధాన్యం విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఏవో, సీడీఎస్‌టీ మేడం, ఆర్ఎస్‌కే సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.