హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరాలపై అవగాహన

ASF: కాగజ్‌నగర్ రూరల్ ఎస్సైగా నూతన బాధ్యతలు స్వీకరించిన సంధ్యారాణి బారెగూడ గ్రామ పంచాయతీని సందర్శించారు. సర్పంచ్ కోట వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మహిళల రక్షణ, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజలకు వివరించారు. సమస్యల పరిష్కారం కోసం దళారులను ఆశ్రయించకుండా నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.