హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'మత్స్యకారుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా'

ADB: ఆదిలాబాద్‌లోని గంగపుత్ర సంఘ భవనంలో శనివారం నిర్వహించిన ప్రపంచ మత్స్య దినోత్సవంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని పూజలు చేశారు. మత్స్యకారుల సమస్యలపై అసెంబ్లీలో పోరాడతానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కేంద్ర సబ్సిడీ పథకాలు గంగపుత్రులకు అందడం లేదని విమర్శిస్తూ, మత్స్య పరిశ్రమకు 90 శాతం సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.