KDP: ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ ఛైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డిపై బోర్డు డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. మొత్తం 12 మంది డైరెక్టర్లలో 11 మంది సంతకాలతో కూడిన నోటీసును DLSO సత్యానందకు అందజేశారు. ఛైర్మన్ పనితీరు, వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్న డైరెక్టర్లు రాజీనామా చేయాలని కోరినా ఆయన నిరాకరించినట్లు సమాచారం. దీంతో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ ఛైర్మన్‌పై అవిశ్వాసం


