హైదరాబాద్: 28°C
వార్తలు

విస్తరించిన అల్పపీడనం.. మోస్తరు వర్షాలు

ఉత్తర ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు అల్పపీడనం విస్తరించింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 4.5 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడి, నైరుతి దిశగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.