హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చేబ్రోలులో పైప్‌లైన్ లీకేజీతో నీరు వృథా

ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో రక్షిత మంచినీటి ట్యాంకు లీకేజీతో పాటు పైప్‌లైన్‌లో కూడా లీకేజీ అవుతోంది. పైనా, కిందా నీరు కారుతుండటంతో ప్రతినిత్యం వేల లీటర్ల నీరు వృథాగా రోడ్డుపైకి చేరుతోంది. నీటి పొదుపు అనే మాట వృథాగానే మిగిలిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు లీకేజీని అరికట్టాలని కోరుతున్నారు.