హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీలో ప్రశ్నార్థకంగా చిన్నారుల భద్రత

AKP: రోలుగుంట మండలం రత్నంపేట అంగన్వాడీ కేంద్రం పైకప్పు, గోడలు దెబ్బతినడంతో వర్షపు నీరు గదిలోకి కారుతోంది. గోడలు, కిటికీలకు పగుళ్లు ఏర్పడి తేమ చేరడంతో చిన్నారులను కూర్చోబెట్టడం కష్టంగా మారింది. వంట సామగ్రి సైతం తడిసిపోతోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.