హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడు నెలలుగా తాగునీరు వృథా!

నంద్యాల పట్టణంలోని 24వ వార్డులో మూడు నెలలుగా పైపులైన్ లీకేజీతో వేల లీటర్ల తాగునీరు వృథా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని డీవైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ విమర్శించారు. తక్షణమే లీకేజీలకు మరమ్మతులు చేపట్టాలని, లేనిపక్షంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.